పేదలకు అండగా సీఎం చంద్రబాబు…

పేదలకు అండగా సీఎం చంద్రబాబు…
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము..
రూ.12.15లక్షల…సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ..
గుడివాడ – ఆంధ్రప్రభ : సీఎం రిలీఫ్ ఫండ్ నిధి.. కష్టాల్లో ఉన్న పేదలకు పెన్నిధి వంటిదని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. పేద ప్రజల కష్టాల్లో అండగా నిలుస్తున్న సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గుడివాడ టీడీపీ కార్యాలయం (ప్రజా వేదిక)లో …. నియోజకవర్గ పరిధిలోని 30బాధిత కుటుంబాలకు రూ.12.15లక్షల సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రాము పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే రాము, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న రోజుల వ్యవధిలో చెక్కులు రావడంతో లబ్ధిదారులు హార్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మీడియాతో మాట్లాడారు….ఆపద సమయంలో అత్యవసరంగా అప్పు చేసి వైద్యం చేయించుకున్న పేదలకు రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తుందన్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఏ ఒక్కరు వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదని ఆశయంతో నా వంతు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం హయంలో నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు రూ.5.48కోట్ల సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు.

మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు అండగా నిలుస్తూ, వారి సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారని కొనియాడారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకుంటున్న ప్రతి ఒక్కరూ, కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించి, మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రవి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టిడిపి అధ్యక్షుడు వాసే మురళి, బీజేపీ నాయకులు అంగడాల సతీష్, టీడీపీ నాయకులు పిన్నమనేని బాబ్జి,పండ్రాజు సాంబయ్య, లింగం ప్రసాద్, గుడివాడ జోన్స్ దయానంద్, పులవర్తి డేవిడ్ బాబు, నేరుసు కాశి, లోయ విజయ్, వేశపోగు ఇమ్మానుయేలు, వంగపండు ఆదినారాయణ, కడియాల గణేష్, యార్లగడ్డ సుధారాణి, సిరిపురపు తులసీరాణి, గొర్ల శ్రీలక్ష్మి, షేక్ జానీ, రెడ్డి షణ్ముఖ, పోట్లూరి కృష్ణారావు, పెద్ది బోయిన లక్ష్మీ నరసింహారావు, నిరంజన్, షేక్ సర్కార్ ,ఏసుబాబు, రఫీ, దేవేంద్రుడు, అంజిరెడ్డి, ఉబ్బల వెంకటేశ్వరరావు, బసవయ్య ,మాదాల సునీత, ప్రభాకర్ రెడ్డి, వల్లభనేని రంగబాబు, నవాబు, ఈశ్వరరావు, కాటూరి శివాజీ, తెలుగు యువత, తెలుగు మహిళా, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
