faria abdullah| మ‌త్తెక్కిస్తున్న జాతిర‌త్నాలు హీరోయిన్‌

faria abdullah| మ‌త్తెక్కిస్తున్న జాతిర‌త్నాలు హీరోయిన్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన‌ ఫరియా అబ్దుల్లా టాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు పొందింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ హాట్ బ్యూటీ. కానీ ఆ త‌ర్వాత స‌రైన హిట్ ప‌డ‌లేదు. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకున్నా.. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఆ మధ్య శ్రీ సింహతో కలిసి నటించిన మత్తువదలరా 2 సినిమా ఒక్కటి కాస్త పర్లేదు అనిపించుకుంది. ఆ మ‌ధ్య స్పెషల్ సాంగ్ లోనూ మెరిసింది. బంగార్రాజు, మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్‌లో న‌ర్తించింది. నవీన్ పోలిశెట్టి ఒకరాజు ఒక రాణి సినిమాలో గెస్ట్ రోల్స్ లనూ నటించింది. ఇటీవ‌ల గుర్రం పాపి రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఇకపోతే సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా స్పాట్ లైట్ వెలుగులో ఉన్న స్టిల్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Leave a Reply