తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం రక్తదాన శిబిరం
వర్ని, ఆంధ్రప్రభ ; డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వివేకానంద బ్లడ్ డోనర్స్ ఫౌండర్ సంతోష్ తెలిపారు. తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు వివరించారు.వర్ని మండల కేంద్రం లోని రైతు వేదికలో మంగళవారం ఈ రక్త దాన శిబిరం ఏర్పాటు చేసినట్లు వివరించారు. చిన్నారుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని యువకులు పెద్ద ఎత్తున రక్త దానం చేయడానికి ముందుకు రావాలని సంతోష్ కోరారు
