శివనగర్‌లో చలివేంద్రం ప్రారంభం..

కరిమాబాద్, ఆంధ్రప్రభ : చలివేంద్రాలు ప్రజలు, బాటసారుల దాహార్తిని తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని 35వ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ మెరుగు అశోక్ తెలిపారు.
గురువారం 34వ డివిజన్ శివనగర్‌లో భారీ ఎత్తున చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవికాలంలో ప్రజలు వివిధ పనుల నిమిత్తం రాకపోకలు కొనసాగిస్తుండగా, అధిక ఉష్ణోగ్రతల కారణంగా బయటకు వచ్చే వారికి చల్లటి నీటి అవసరం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చలివేంద్రాల ఏర్పాటు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
అండర్ బ్రిడ్జ్ ప్రధాన రహదారి శివనగర్‌లో ప్రయాణికులు, బాటసారుల సౌకర్యార్థం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని, జూన్ రెండవ వారం వరకు నిరంతరంగా మినరల్ వాటర్ అందజేస్తామని మెరుగు అశోక్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ ధన మైసమ్మ దేవాలయ అధ్యక్షుడు తోట బాబన్న, గడ్డం రవి, బాలాజీ, యుగంధర్, రాంబాబు, భాస్కర్, బజ్జూరి అంజయ్య, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
