9వ వార్డులో కాంగ్రెస్ జోరు

-ప్రచారంలో దూసుకుపోతున్న యువనేత సంపత్ రాజు
ఎమ్మెల్యే, ఎంపీ అండ..యువజన విభాగం అండదండలు!
-సంక్షేమ పథకాలే గెలుపు గుర్రాలుగా సంపత్ విశ్వాసం
స్టేషన్ ఘన్ పూర్, ఫిబ్రవరి4 ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్ పూర్ మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా 9వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న యువజన నాయకుడు సౌదర పల్లి సంపత్ రాజు తన దూకుడుతో ప్రత్యర్థుల్లో వణుకు పుట్టిస్తున్నా రు. సామాన్య కార్యకర్త నుండి అంచెలంచెలుగా ఎదిగిన సంపత్ ప్రజా క్షేత్రంలో తిరుగులేని మద్దతును కూడగట్టుకుంటున్నారు.
-ఎమ్మెల్యే కడియం, ఎంపీ కావ్య సహకారమే బలం:
వార్డులో స్థానిక నాయకులతో సంపత్ కలిసి బుధవారం ఇంటింటా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ మారజోడు రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య ఆశీస్సులతో, అభివృద్ధి అంటే ఏమిటో 9వ వార్డులో చేసి చూపిస్తానని సంపత్ రాజు ఓటర్లకు వివ రిస్తూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు మరియు ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందేలా నిరంతరం శ్రమిస్తానని ఆయన పేర్కొన్నారు. అర్ధరాత్రి పిలిచి నా పలికే సేవాగుణం నాది అని సంపత్ రాజు ఇంటింటి ప్రచారంలో ఓటర్లను కోరుతున్నారు. యువత అంతా ఏకతాటిపై సంపత్ రాజు గెలుపు కోసం పని చేస్తుండటంతో, కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది.
