Bjp Congress Clash : మన్నడిపేట ఉద్రిక్తం Andhra Prabha News

Bjp Congress Clash : మన్నడిపేట ఉద్రిక్తం Andhra Prabha News
- హోంమంత్రి ఇలాఖాలో రచ్చ
- బీజేపీ, కాంగ్రెస్ కయ్యం
- పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్
- 40 దాటిన పోలింగ్ శాతం
( ఆంధ్రప్రభ, పుదిచ్చేరి ప్రతినిధి)

Bjp Congress Clash : పుదిచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో జనం పోలింగ్ బూత్‌ల్లో బారులు తీరారు. మండేఎండనుఏ సైతం లెక్క చేయకుండా పోలింగ్ బూతులకు చేరారు. మద్యాహ్నం 12.00 గంటలకు 40 శాతం పైగా ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు.ఇక పోలింగ్ వేళ.. సహజ ఘర్షణ వాతావరణం పుదిచ్చేరీ హోం మంత్రి నామశివాయం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

మన్నడిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని తిరుక్కనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం సమీపంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చెలరేగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మద్దతుదారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.

ఇక మన్నడిపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నియోజకవర్గంలో బీజేపీ నాయకుడు, హోం మంత్రి ఎ. నామశివాయం, కాంగ్రెస్ అభ్యర్థి టి.పి.ఆర్. సెల్వమే తో హోరాహోరీగా తలపడుతున్నారు. హోంమంత్రి ఇలాఖా కావటంతో పోలీసులు కూడా జాస్తిగానే స్పందించారు. లాఠీలకు పని చెప్పారు. గుంపును చెదరగొట్టారు. ఇది స్వల్ప ఘటనేనని పోలీసులు వివరించారు.
