అన్నదానం కోసం విరాళాలు అందచేత…

అన్నదానం కోసం విరాళాలు అందచేత…

బిక్కనూరు, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో గల సిద్ధిరామేశ్వర ఆలయంలో నిత్య అన్నదానం కోసం బుధవారం భక్తులు విరాళాలు అందజేశారు. చైత్రమాసం కృష్ణ షష్టి సందర్భాన్ని పురస్కరించుకొని పలు ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు.

అనంతరం హైదరాబాదుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త చంద్రమౌళి కుటుంబ సభ్యులు అన్నదానం కోసం 15 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. వారిని ఆలయ అనువంశ అర్చకులు కొడగండ్ల రామగిరి శర్మ అభినందించారు. భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం కొనసాగించడం జరుగుతుంద ని తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు విరాళాలు అందజేయాలని ఆయన కోరారు.

Leave a Reply