Us Political Risk : ప్రమాదంలో ట్రంప్​ Andhra Prabha News

Us Political Risk : ప్రమాదంలో ట్రంప్​ Andhra Prabha News

  • సీజ్​ ఫైర్ ఉపశమనమే
  • కానీ ట్రంప్​ కే ప్రమాదం
  • ఆయన పదవికి గండం
  • పైగా అనర్హుడు ముద్ర తప్పదు
  • అమెరికా కాంగ్రెస్​ సభ్యురాలు జోస్యం
  • అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చ

( ఆంధ్రప్రభ, వాషింగ్టన్​ ప్రతినిధి)

Us Political Risk : ఇరాన్ కాల్పుల విరమణతో ‘తాత్కాలిక ఉపశమనం’ లభించింది కానీ, ట్రంప్ పరిస్థితి మాత్రం ప్రమాదకరమేనని ఇరానియన్-అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు, హెచ్చరించారు. ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటనతో తాను “తాత్కాలిక ఉపశమనం” పొందినట్లు అమెరికా కాంగ్రెస్‌లో ఏకైక ఇరానియన్-అమెరికన్ సభ్యురాలు యస్సామిన్ అన్సారీ అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ పదవికి “ప్రమాదకరం తప్పదని ఆయన అనర్హుడే అని ఆమె హెచ్చరించారు . తమ ప్రభుత్వం నుంచి కాకుండా, స్వేచ్ఛ కోసం పరితపించే అమాయక పౌరులుగా, సంభావ్య అణు విపత్తు భయంతో భయంకర 24 గంటలు గడిపిన 9 కోట్ల మంది ఇరానీయులకు ఈ విరామం తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తుందని అన్సారీ నొక్కి చెప్పారు.

Leave a Reply