బాసరలో సీఎం మనవడికి అక్షరాభ్యాస పూజలు

బాసరలో సీఎం మనవడికి అక్షరాభ్యాస పూజలు
బాసర (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి పుణ్యక్షేత్రానికి సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బాసరకు చేరుకున్నారు. అనంతరం కుటుంబ సమేతంగా అమ్మవారి ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి , ప్రత్యేక అక్షరాభ్యాస పూజలు జరిపించరు.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఆలయంలోని అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యులు అమ్మవారి విశిష్టత చరిత్రను ముఖ్యమంత్రికి వివరించారు. వీరి వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.


