మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కమ్మర్ పల్లి, ఉప్లూర్ శాఖ నందు సంఘ పీఐసి అధ్యక్షుడు రమన్‌కుమార్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి, డబ్బులు తొందరగా రైతుల ఖాతాలో జమ చేయాలని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని,ప్రభుత్వం ప్రారంభించిన మార్క్ ఫెడ్ ద్వారా విక్రయించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఎంసి చైర్మన్ పాలెపు నరసయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, మండల కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సుంకేట రవి, గ్రామ కమిటీ అధ్యక్షుడు జెల్ల సదానంద్,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ముల రవీందర్, నాయకులు ఏలేటి మోహన్ రెడ్డి, బోనగిరి భాస్కర్, బద్దం తిరుపతి రెడ్డి, బద్దం రాజేశ్వర్, అవారి సత్యం, సాదుల్లా, నరేష్, అజయ్ ,రాకేష్, అంజిత్, రాజశేఖర్, సాయన్న, విజయ్, దినేష్, గ్రామ రైతులు, ఏఈఓ రమేష్, పిఏ సిఎస్ కార్యదర్శి శంకర్ సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply