హిందూ సమ్మేళనం విజయవంతం చేయండి

హిందూ సమ్మేళనం విజయవంతం చేయండి

ఇంటింటికి కరపత్రాలు పంపిణీ

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో ఈనెల 6న జరగనున్న హిందూ సమ్మేళనం లో హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మక్తల్ మున్సిపల్ బిజెపి ఫ్లోర్ లీడర్ బి.రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హిందూ సమ్మేళనంలో భాగంగా శనివారం మక్తల్ పట్టణం లో గల 1వ వార్డ్, 11వ వార్డు లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా దేశమంతటా హిందూ సమ్మేళనం కొనసాగుతున్న నేపథ్యంలో మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద గల రామ్ లీలా మైదానంలో ఈనెల 6న సాయంత్రం 6 గంటలకు సమ్మేళనం సభ ఉంటుందని అన్నారు. హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని హిందూ సంఘటిత శక్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి.జె.పి నాయకులు విద్యా సాగర్, రాఖేష్, కుర్వ మహాదేవ్, శ్రీధర్, శ్రీను, వినోద్, బి. బాల్ రెడ్డి, బి. రవీందర్ రెడ్డి, శివానంద్ రెడ్డి, హీరా లాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply