రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ కొత్త రుసుములు అమల్లోకి

రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ కొత్త రుసుములు అమల్లోకి

మీసేవ సేవలకు కొత్త రేట్లు పాత చార్జీలతో పోల్చవద్దని సూచన
వినియోగదారులు సహకరించాలని జిల్లా మీసేవ అధ్యక్ష,కార్యదర్శుల విజ్ఞప్తి.

నిజామాబాద్ అర్బన్, ఆంధ్రప్రభ : జిల్లా మీసేవ వినియోగదారులకు ముఖ్య గమనిక రాష్ట్ర ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం,ఏప్రిల్ 1 నుంచి మీసేవ సేవలపై కొత్త చార్జీలు అమలులోకి వచ్చాయి. దీంతో గతంలో కంటే ప్రస్తుతం సేవల రుసుముల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అందువల్ల, వినియోగదారులు పాత చార్జీలతో పోల్చి సందేహాలు వ్యక్తం చేయకుండా,ప్రభుత్వం నిర్ణయించిన తాజా రుసుములను చెల్లించి సహకరించాలని జిల్లా మీసేవ అధ్యక్షులు సితారే క్షేవిన్ (రాజ్ ) విజ్ఞప్తి చేస్తున్నారు.

“మేము నిన్నే అప్లై చేసాం,అంత ఛార్జ్ లేదు… మా ఫ్రెండ్స్, బంధువులు తక్కువ చెల్లించారు…”ఎవంటి అపోహలు పెట్టుకోకుండా, తాజా చార్జీలను గమనించి సేవలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.ఇదే సమయంలో, ఇన్నేళ్లుగా పెంపు లేకుండా ఉన్న మీసేవ సేవల చార్జీలను పెంచినందుకు,రాష్ట్ర ప్రభుత్వానికి మీసేవ కేంద్రాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply