Trump Warns Allies : మీ చమురు మీరే తెచ్చుకోండి Andhra Prabha News
Trump Warns Allies : మీ చమురు మీరే తెచ్చుకోండి Andhra Prabha News
లేకపోతే అమెరికాకు రండి
మిత్ర దేశాలపై ట్రంప్ ఉక్రోశం
( ఆంధ్రప్రభ, వాషింగ్టన్ ప్రతినిధి)
Trump Warns Allies : విపరీతంగా ఇంధన ధరల పెరుగుదలతో కలత చెందిన మిత్ర దేశాలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం ఎద్దెవ చేశారు. “మీ సొంత చమురును మీరే తెచ్చుకోండి” అని ఆయన హేళన చేశారు. “మీరు మీ కోసం మీరే పోరాడటం నేర్చుకోవాలి, మీరు మాకు అండగా లేనట్లే, ఇకపై మీకు సాయం చేయడానికి అమెరికా ఉండదు. ఇరాన్ నాశనమైపోయింది. కష్టమైన పని పూర్తయింది. వెళ్లి మీ చమురును మీరే తెచ్చుకోండి,” అని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్‌ఫామ్‌లో రాశారు .

ఇరాన్ ఆధీనంలోని హోర్ముజ్ జలసంధిని బలవంతంగా తెరవడానికి అమెరికాకు సహాయం చేయని మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఉక్రోశం వెళ్లగక్కారు, “మా దగ్గర చమురు పుష్కలంగా ఉంది” కాబట్టి అమెరికా నుండే జెట్ ఇంధనాన్ని కొనుగోలు చేయాలని కూడా అమెరికా అధ్యక్షుడు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు దూసుకుపోతున్న నేపథ్యంలో, 2022 తర్వాత తొలిసారిగా అమెరికాలో గ్యాస్ ధరలు సగటున $4డాలర్లు (€3.48) దాటిన రోజే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపు నాలుగేళ్ల కిందట , ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దాడి చేసిన తర్వాత, అమెరికా వాహనదారులు సామూహికంగా పెట్రోల్ బంకు వద్ద ఇంత ఎక్కువ చెల్లించడం ఇదే మొదటిసారి.
