ఎల్లంపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం

బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలోని ఎల్లంపల్లి గ్రామంలో మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. తెలంగాణ మోడల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ శిబిరం ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు కొనసాగింది.
డా. కొండ్ల విద్యా ప్రకాష్ నేతృత్వంలో వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా ఎముకల సమస్యలు, నరాల సమస్యలు, రక్తపోటు (బీపీ), షుగర్, ఈసీజీ, గుండె సంబంధిత వ్యాధులపై పరీక్షలు నిర్వహించారు.
గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో హాజరై ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
