అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా..

అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని ధర్మోజి గూడెం గ్రామ సర్పంచ్ జువ్వి నర్సింహ్మ అన్నారు. చౌటుప్పల్ మండలంలోని ధర్మోజిగూడెం గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణం పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ జువ్వి నర్సింహ్మ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో అభివృద్ధి పుంజుకుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే చెల్లిందన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అడుగుజాడల్లో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పక్కీరు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు సామిడి సంధ్య, ఐతరాజు శారద లింగస్వామి, రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ, గునుగంటి వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, మాజీ ఉప సర్పంచ్ లు బత్తుల శ్రీహరి, కొంతం బుచ్చిరెడ్డి, గ్రామస్తులు ఊదరి లింగయ్య, దాసర్ల లింగయ్య, పగిళ్ళ అమర్ నాద్ రెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
