మలబార్ గోల్డ్ నూతన నగల షోరూమ్ ప్రారంభం…

మలబార్ గోల్డ్ నూతన నగల షోరూమ్ ప్రారంభం…
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : శాంతి నగర్లో ఐబీ కార్యాలయం ఎదురుగా మలబార్ గోల్డ్ డైమండ్ నూతన నగల షోరూమ్‌ను సోమవారం టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ నిర్వాహకులు నిర్మలా జగ్గారెడ్డికి ఘన స్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఆమె షోరూమ్‌లో ఏర్పాటు చేసిన వివిధ నగలను పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి వంటి అభివృద్ధి చెందుతున్న పట్టణంలో మలబార్ గోల్డ్ షోరూమ్ ఏర్పాటు చేయడం ఆనందదాయకమని తెలిపారు. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలు రావడం వల్ల స్థానికంగా వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కూన వనితా సంతోష్, కౌన్సిలర్ సంగీత మహేష్, నాయకులు కూన సంతోష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
