లక్షేట్టిపేట మున్సిపల్ బడ్జెట్ రూ.2574.89 లక్షలు

లక్షేట్టిపేట మున్సిపల్ బడ్జెట్ రూ.2574.89 లక్షలు

లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : మున్సిపాలిటీ 2026-27 ఆర్ధిక సంవత్సరానికి గాను మొత్తం బడ్జెట్ రూ. 25 కోట్ల 74 లక్షల 89 వేలుగా శనివారం జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రయ్య, చైర్ పర్సన్ దొంత అంజలి అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఆమోదం తెలిపారు. మున్సిపల్ మొత్తం రెవెన్యూ ఆదాయం రూ. 3 కోట్ల 42 లక్షల 63 వేలు కాగా, వీటిలో సిబ్బంది జీతాల కోసం రూ. కోటి 70 లక్షలు, పారిశుద్ధ్య నిర్వహణ రూ. 51 లక్షల 98 వేలు, కరెంటు చార్జీలు రూ. 6 లక్షలు, రుణాల చెల్లింపులు రూ. 20 లక్షలు, గ్రీన్ బడ్జెట్ రూ. 33లక్షల 60 వేలు, ఇంజినీరింగ్ నిర్వహణ రూ. 17 లక్షలు, పరిపాలన రూ. 42.55 లక్షలు, టౌన్ ప్లానింగ్ రూ. 1 లక్ష 50 వేలు, డిపాజిట్స్, అడ్వాన్స్ లు రూ.9 లక్షలు గా ఆమోదించారు.

కాగా, రూ. 21 కోట్ల 42 లక్షల 26 వేలను పలు రకాల గ్రాంట్ ఆదాయంగా అంచనా వేశారు. మొత్తం రూ. 25 కోట్ల 80 లక్షల 84 వేలు గా మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) చంద్రయ్య మాట్లాడుతూ ఈ అంచనా బడ్జెట్ ను సభ్యులు సక్రమంగా అర్ధం చేసుకోవాలని, అదే విధంగా ప్రతి కౌన్సిలర్ తమ వార్డ్ లలో ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా మున్సిపాలిటీ ఆదాయంను పెంచే మార్గాలను పాటించాలన్నారు.

అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి – నర్సయ్య మాట్లాడుతూ సభ్యులందరి సహకారంతో అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. బడ్జెట్ ను ప్రణాళిక ప్రకారం వ్యయ, రాబడి లను దృష్టిలో పెట్టుకుని కౌన్సిల్ ముందుకు వెళ్ళుతుందని తెలిపారు.

ఈ బడ్జెట్ సమావేశంలో వైస్ చైర్ పర్సన్ మోతుకూరి రాజేశ్వరి-వెంకటస్వామి గౌడ్,మున్సిపల్ కమీషనర్ విజయ్ కుమార్, మేనేజర్ రాజశేఖర్, కౌన్సిలర్లు సిద్దార్థ, పెట్టెం తిరుపతి,శనిగారపు చిన్నయ్య, తోట సువర్ణ, రాజేంద్ర ప్రసాద్, రాందేని జమున, రాజ లింగయ్య, పెండెం పద్మ – రాజు, సూరం చంద్రమౌళి, పర్వీన్ సుల్తాన, బిరుదుల సత్యనారాయణ, మైలారపు సుధాకర్, గోప సుజాత -రమేష్,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply