కొలాం గిరిజనులు అంటే జంతువుల కంటే హీనమా..

కొలాం గిరిజనులు అంటే జంతువుల కంటే హీనమా..

ఎల్ పి హెచ్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహన్

ఉట్నూర్,ఆంధ్రప్రభ : కొలం ఆదివాసి గిరిజనులు అంటే జంతువుల కంటే హీనమా అని లంబాడ హక్కుల సంరక్షణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బి ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భరత్ చౌహన్ అన్నారు. ఆయన శనివారం అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని దొంగ చింత,కుమ్మరి కుంట కొలం ఆదివాసి గ్రామాలను సందర్శించారు. ఆ గ్రామంలో కులం గిరిజనులతో కలిసి కుమ్రం సూరు విగ్రహం వద్ద పూజలు చేసి, ఆయా గ్రామాల్లో అటవీశాఖ అధికారులు అడ్డుకొని అసంపూర్తిగా నిలిచిపోయిన, పీఎం జన్మన్ ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు.

అనంతరం గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ముందస్తు ప్రణాళిక, అనుమతులు_ _తీసుకోకుండా అడవినే తమ జీవన ఆధారంగా భావించే కోలాం తెగకు ఇండ్లు మంజూరు చేసిందని ప్రభుత్వం నుంచి మాకు ఇండ్లు మంజూరయ్యాయి అని సంతోష పడి ఉన్నటువంటి ఇండ్లను తీసేసి గుడిసెలలో ఉంటూ బేస్ మెట్లు తవ్వడం జరిగిందని ఆయన అన్నారు.

ఫారెస్ట్అధికారులుఅడ్డుకునేసరికి ఉన్న ఇల్లు పోయి రోడ్డుమీద రోడ్డు మీద పడిపోయారని ప్రభుత్వం వెంటనే ఇండ్ల నిర్మాణానికి కావలసిన అనుమతులు ఇచ్చి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని భరత్ చౌహన్ డిమాండ్ చేశారు.లేనిపక్షంలో గిరిజన తిరుగుబాటు ఉంటుందని ఆయన హెచ్చరించారు.

ఈ సమావేశంలో కోలాం సంఘం రాష్ట్ర నాయకులు టేకం వసంతరావు,ఆత్రం ముకుందరావు, కొడప రాజు, మడవి రమేష్,టెకం రాజు పటేల్, టెక్కం చిన్ను, కొడప అనసూయ, శ్రీడం ధర్మం, టేకంజంగు,కొడప అనిల్, శ్రీరామ్ లతోపాటు ఉట్నూర్ కు చెందిన గంగారాం నాయక్, రామారావునాయక్,సీతారాం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply