ap-1-state-1-capital : ఏపీకి ఒక్కటే రాజధాని Andhra Prabha Assembly News

ap-1-state-1-capital : ఏపీకి ఒక్కటే రాజధాని Andhra Prabha Assembly News

  • అదీ అమరావతే
  • అదే శాశ్వతం.
  • రాజధాని ఇంచ్ కూడా కదలదు
  • అసెంబ్లీలో ఏపీ సీఎం ఉద్వేగం
  • రాజధాని తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవం

( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్​ నెట్​ వర్క్) ​

ap-1-state-1-capital

ఏ పీకి ఒక్కటే రాజధాని.. అది అమరావతి మాత్రమే. అదే శాశ్వతం. రాజధానిని ఎవరూ టచ్ చేయలేరు, ఇంచ్ కూడా కదలదు. అమరావతి అజేయం, అమరావతి అద్భుతం, అమరావతితోనే తెలుగు వైభవం. అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉద్వేగంతో అన్నారు. రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా అమోదించింది.

ap-1-state-1-capital

ఈ చారిత్రాత్మక తీర్మానాన్ని ఈ రోజే కేంద్రానికి ఏపీ శాసనసభ పంపిస్తోంది. ఈ తీర్మానాన్ని శాసన సభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టగా.. తొలుత పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ మద్దతు తెలిపారు.

ap-1-state-1-capital

అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్​ కళ్యాణ్​, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్​, అచ్చెంనాయుడు, నారాలోకేష్​ బాబు, సత్యకుమార్​ యాదవ్​, హోంమంత్రి అనిత సహా శాసన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా.. శాసన సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాజధాని తీర్మానానికి మద్దతు తెలిపిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

ap-1-state-1-capital : ప్రధాని భరోసా ఇచ్చారు

ap-1-state-1-capital

అమరావతి నిర్మాణ బాధ్యతను పార్లమెంటు తీసుకుంటుందని ప్రధాని భరోసా ఇచ్చారు అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ, రైతులు ఇచ్చింది భూములు కాదు రాష్ట్రానికి భవిష్యత్తును ఇచ్చారు సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టుగా అమరావతి నిర్మితం అవుతుందని చెప్పాం.. అదే జరిగి తీరుతుంది. రాజధాని వల్ల ఏం జరుగుతుందనే వ్యక్తులు హైదరాబాద్ నుంచి ఏడాదికి 1.05 లక్ష కోట్ల మేర వస్తున్న ఆదాయం చూడాలి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రాంతంగా అమరావతి ఉంటుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి, అని చంద్రబాబు వివరించారు.

ap-1-state-1-capital : ఒక్క చాన్సుతో.. కూల్చేశారు

ap-1-state-1-capital

2019లో ఒక్కఛాన్స్‌తో ప్రజావేదిక కూల్చి విధ్వంస పాలన మొదలు పెట్టారు. 30 ఏళ్లు వెనక్కు వెళ్లింది. రైతులపై ఉక్కు పాదం మోపారు, కేసులు, బూట్లు, లాఠీలతో తన్నులు, అడ్డగోలు కేసులు, కీచకపర్వం చేశారు శాసన మండలిలో సెలెక్ట్ కమిటీతో బిల్లు పాస్ చేయాలని చూశారు. అయినా హైకోర్టు కాపాడింది ఈ తరహా పాలన తుగ్లక్ నిర్ణయం అని, పెట్టుబడులు రావని మీడియా పెద్ద ఎత్తున రాసింది, అని సీఎం వివరించారు.

ap-1-state-1-capital : అందరం బాధితులమే

ap-1-state-1-capital

గత పాలనలో నేను, పవన్ కల్యాణ్ సహా అంతా బాధితులమే. కూటమిగా ఏర్పడి 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించాం. కేంద్రం రూ.15వేల కోట్లు తక్షణం అందించింది. అమరావతి పనులు రీస్టార్ట్ చేశాం. 2028కి పనులు అన్నీ పూర్తి చేసి అమరావతికి ఓ షేప్ తీసుకువస్తాం. 2027 నాటికి ట్రంక్ రోడ్లు, లేఅవుట్స్ సహా వివిధ మౌలిక సదుపాయాలు పూర్తి అవుతాయి. రూ.56 వేల కోట్ల విలువైన 91 పనులు వేగంగా జరుగుతున్నాయి.

ap-1-state-1-capital : వైసీపీ బుద్ధి మారలేదు

ap-1-state-1-capital

వైసీపీ బుద్ధి ఇంకా మారలేదు. అవే కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు రాజ్యాంగంలో రాజధాని అనే పేరే లేదంటారు. వీళ్లకు ఓ ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందా? రాజారెడ్డి రాజ్యాంగాన్ని వీళ్లు అనుసరిస్తారు. దేశం అనుసరించేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. ఏ పీకి ఒక్కటే రాజధాని.. అది అమరావతి మాత్రమే. అదే శాశ్వతం. రాజధానిని ఎవరూ టచ్ చేయలేరు, ఇంచ్ కూడా కదలదు. అని సీఎం వివరించారు. రాజధానిలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని వచ్చిన సమయంలో ఓమారు, ఆ తర్వాత మరోమారు, రెండు రోజుల క్రితం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నాను. అని సీఎం స్పష్టం చేశారు.

ap-1-state-1-capital : ఏపీ గుండె అమరావతి

ap-1-state-1-capital

అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, ఆంధ్రప్రదేశ్ ఆత్మ, ఆమరావతి అందరిదీ అనేలా ఈ నగర నిర్మాణం చేస్తాం. హైదరాబాద్, అమరావతి రెండు నగరాలు అభివృద్ధికి చిరునామాలుగా మారాలి. భవిష్యత్ నగరం అమరావతి, బ్లూ, గ్రీన్ నగరంగా ఇది నిర్మితం అవుతుంది.

ap-1-state-1-capital

దేశం గర్వించేలా అమరావతిని నిర్మించి తీరుతాం. ఒకే రాజధాని అభివృద్ధి మాత్రం అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తాంయ అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మూడు రీజియన్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లు విస్తృతంగా అభివృద్ధి అవుతాయి అమరావతి అజేయం, అమరావతి అద్భుతం, అమరావతితోనే తెలుగు వైభవం. ఈ తీర్మానానికి మద్దతు పలికిన అందరికీ ధన్యవాదాలు అని శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

ALSO READ : 11 Ycp Mlas Absent : ఈ రోజూ రాలేదు Andhra Prabha Assembly News

Leave a Reply