rcb vs srh |కొన్నిగంటల్లో ఐపీఎల్ వార్

rcb vs srh |కొన్నిగంటల్లో ఐపీఎల్ వార్
తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్ ఢీ
రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ షురూ
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 మహా సంగ్రామం మొదలు కానుంది. మార్చి 28 నుంచి మే 31 వరకు మ్యాచులు జరగనున్నాయి. రెండు నెలల పాటు జరిగే ఐపీఎల్ మ్యాచుల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మొత్తం 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 28 నుంచి మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత ప్లే ఆఫ్స్, ఫైనల్స్ జరుగుతాయి. శని, ఆదివారాల్లో రెండేసి మ్యాచులు జరగనున్నాయి. ఒక్క మ్యాచు మాత్రమే ఉన్న రోజుల్లో రాత్రి 7:30 గంటలకు ఆట ప్రారంభం కానుంది. రెండు మ్యాచులు ఉన్న రోజుల్లో ఒకటి మధ్యాహ్నం 3:30 గంటలకు, రెండోది రాత్రి 7.30గంటలకు జరుగుతుంది. 12 వేదికల్లో మ్యాచులు జరగనున్నాయి. ముంబై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, గువాహటి, లక్నో, న్యూ చండీగఢ్, జైపూర్‌లలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
ఈ రోజు తొలి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఢీకొననున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం లో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లైవ్‌ను జియో హాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్‌తో పాటు స్టార్ స్పోర్ట్స్ టీవీ నెట్‌వర్క్‌లో చూడొచ్చు.
