బస్సు, లారీ ఢీకొని…

బస్సు, లారీ ఢీకొని…
25మందికి గాయాలు
వైరా, మార్చి 28 (ఆంధ్రప్రభ ) : ఖమ్మం జిల్లా వైరా స్థానిక పోలీస్ స్టేషన్ పాత ఏపీజీవీబీ బ్యాంక్ సమీపంలో భద్రాచలం నుంచి ఖమ్మం వెళుతున్న ts 28TA 3363 నెంబర్ గల బస్సు లారీ కంటైనర్ ని ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు గాను 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి..
గాయపడ్డ వారిని 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు… సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.

