TG | త్రీఫేస్ విద్యుత్ సరఫరా లేకపోవడంతో సతమతమవుతున్న రైతులు

TG | త్రీఫేస్ విద్యుత్ సరఫరా లేకపోవడంతో సతమతమవుతున్న రైతులు

కేవలం 2 గంటలు మాత్రమే త్రీఫేస్ విద్యుత్ సరఫరాతో సతమతమవుతున్న రైతులు
కాంగ్రెస్ పాలనలో ప్రారంభమైన కరెంటు కష్టాలు- ఆరోపిస్తున్న నడిమిగూడెం రైతులు

TG | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని నడిమిగూడెం గ్రామపంచాయతీలో రైతులు వేసిన మొక్కజొన్న, వరి పంటలకు త్రీఫేస్ విద్యుత్ సరఫరా లేకపోవడంతో యాసంగి పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని,ఆ గ్రామాల రైతులు కొమరం బుచ్చిబాబు, పాయం సాయన్న, సత్యనారాయణ, నరసింహారావు, వెంకటేశ్వర్లు, కొమరం కార్తీక్, మధు, రమేష్, బొమ్మల బొర్రయ్య, కొమరం నరసింహారావు, గొగ్గల నారాయణ, బొమ్మల సత్యం, కొమరం కృష్ణ, పుల్లయ్య, నాగేష్, లాలయ్య,కొమరం సీతారాములు, సురేష్, పాయం వెంకన్న, చిరంజీవి, అంజిబాబు,కొలబోయిన కృష్ణ, చంద్రం అనే రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల జనవరి ఫిబ్రవరి నెలల్లో 24 గంటలకు 19, 20 గంటల వరకు త్రిఫేస్ విద్యుత్ సరఫరా చేసేవారని గుర్తు చేశారు. కానీ మార్చి నెల్లో పూర్తిగా త్రీఫేస్ విద్యుత్ కనీసం 2 గంటలు,3 గంటలు కూడా త్రీఫేస్ విద్యుత్ సరఫరా ఉండే పరిస్థితి లేకపోవడంతో, వేసుకున్న పంటలు ఎర్రటెండలకు మాడిబూడిద కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

తెచ్చిన అప్పులు తీరుతాయా, లేదానని కుటుంబం పోషణ కోసం తెచ్చిన అప్పులు సైతం భారీగానే ఉండడంతో, దానికి తోడుగా త్రీఫేస్ విద్యుత్తు సరఫరా సరిగా లేకపోవడంతో రైతన్నల పరిస్థితి అధోగతిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. త్రీఫేస్ విద్యుత్ 2 గంటలు ఉండలేని పరిస్థితితో మొక్కజొన్న, వరి పంటలకు సరిపడ నీళ్లు లేక తడి పొడి సాగులతో సతమతమైతున్నామని పంటలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీలో కరెంటు కోతలు కష్టాలు మొదలయ్యాయని ఆందోళనతో రైతుల సమస్యలు తీరేదేన్నడోనని పాత్రికేయుల ముందు రైతుల గోడు విలపిస్తున్నారు. అదే క్రమంలో ఇల్లందు నుండి ఉమ్మడి గుండాల, ఆళ్లపల్లి మండలాలకు సుదూరం కావడం 78.5 సర్క్యూట్ మూలాన విద్యుత్ సరఫరాలో కొంతగా లోవోల్టేజ్ రావడం జరుగుతుందని రైతులు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.

రైతులకు లోవోల్టేజి విద్యుత్ సమస్యను అధిగమించేందుకు 6 యూనిట్లు,5 బూస్టర్లను సైతం ట్రాన్స్ఫార్మర్లకు సైతం అమర్చినప్పటికి,వేసవి కాలం మూలాన ఎక్కువగా విద్యుత్ సరఫరాను వినియోగించుకోవడంతో కొంత లోవోల్టేజీ సమస్య తలెత్తడం జరుగుతుందని గుర్తు చేశారు.ఏదేమైనా మర్కోడు పంచాయతీలో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో కొంత విద్యుత్ సమస్యలు, లోవోల్టేజ్ సమస్యలను పునరావృతం కాకుండా చూడగలుగుతామని విద్యుత్ శాఖ అధికారులు తేల్చి చెప్పారని, ఈ వేసవి పంటలకు కొంత విద్యుత్ అంతరాయంతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, పంట దిగుబడి అంతంత మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు సమస్యలను సంక్షిప్తంగా అర్థం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

విద్యుత్ అధికారులు ఏమంటున్నారంటే..

అదనంగా ట్రాన్స్ఫార్మర్లకు నూతనంగా బూస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, నూతనంగా ట్రాన్స్ఫార్మర్ మర్కోడు పంచాయతీలో ఏర్పాటు చేస్తున్నామని స్థలం పరిశీలనలో ఉన్నామని కొంత సంయమనం పాటించాలని రైతులను విద్యుత్ శాఖ అధికారులు బుజ్జగిస్తున్నప్పటికీ, వేసిన మొక్కజొన్న పంటలు బీడుభూములుగా, నిర్జీవ ప్రదేశాలుగా పంటలు పూర్తిగా మారిపోయాయని, రైతులు గోడును విద్యుత్ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. గుండాల, మామకన్ను, ఆళ్లపల్లి ప్రదేశాల్లో 33/ 11కెవి సబ్ స్టేషన్ ఉండడం, ఇల్లందు నుండి సూదుర ప్రాంతం నుండి 133/11కెవి విద్యుత్ సరఫరా సరిగా సరిపోకపోవడంతో, ఉమ్మడి మండలాల రైతుల పంటలకు త్రీఫేస్ విద్యుత్ అందించలేకపోవడం జరుగుతుందని గుర్తు చేశారు.

దాంతో విద్యుత్ అధికారులు రైతుల మధ్య కొంత వాగ్విధాలు సైతం నెలకొండడంతోనూ చేసేదేమీలేక రైతులను అధికారులు బుజ్జగించడం శాంతింపజేసి వారికి కొంత ఊరటను కల్పించేలా అవగాహన కల్పిస్తున్నప్పటికీ వేసిన యాసంగి మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోవడంతో రైతులు కన్నెర్ర చేయడం ఆందోళన, నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు చోరవచూపి, ఏప్రియల్ నెల మొత్తంగా త్రీఫేస్ విద్యుత్ సరఫరా అయ్యేందుకు విద్యుత్ అధికార్లు కృషి చేయాలని ముక్తకంఠంతో కోరారు.

Leave a Reply