త్రుటిలో తప్పిన ప్రమాదం..

త్రుటిలో తప్పిన ప్రమాదం..
స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు
కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఘటన
కొత్తూరు, ఆంధ్రప్రభ : త్రుటిలో పెను ప్రమాదమే తప్పిన సంఘటన సోమవారం కొత్తూరు మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. కర్నూల్ కు చెందిన షేక్ అహ్మద్ తన మరో నలుగురు స్నేహితులతో కలిసి హోండా అమేజ్ కారులో సోమవారం ఉదయం హైదరాబాద్ బయలుదేరారు.
ఈ క్రమంలో మార్గం మధ్యలో కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మపూర్ లో గల ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే హోండా అమేజ్ కారు ముందు వెళ్తున్న వాహనం పెట్రోల్ బంక్ లోకి వెళ్తుండటంతో అక్కడే నిలుపుకున్న కారును వెనకాల నుండి టిప్పర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జు నుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలపాలైన క్షతగాత్రులను కొత్తూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో నేషనల్ హైవే నిమిషాల్లోనే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో షాద్ నగర్ ట్రాఫిక్ పోలీసులు, స్థానిక పోలీస్ సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి వాహనాన్ని రోడ్డు మద్యలోనుండి కారును తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.
