తెలుగు లోగిళ్లలో ఉగాది సందడి

తెలుగు లోగిళ్లలో ఉగాది సందడి

ఆరు రుచులు…జీవితంలో ఎదురయ్యే ఆరు రకాల భావోద్వేగాలు

గంపలగూడెం,ఆంధ్రప్రభ : తెలుగు లోగిళ్లలో ఉగాది సందడి ప్రారంభం అయింది.వసంత రుతువు ప్రారంభాన్ని సూచిస్తూ,మామిడి తోరణాలు,షడ్రుచుల పచ్చడి, పంచాంగ శ్రవణంతో ఎంతో ఆనందంగా,సంప్రదాయబద్ధంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరం జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. తెల్లవారుజామున తలస్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించి భగవంతుని పూజలతో ఇళ్లు కళకళలాడుతాయి.అత్యంత ముఖ్యమైన సాంప్రదాయ ప్రసాదంమైన షడ్రుచుల పచ్చడిని స్వీకరిస్తారు.

షడ్రుచులు అనగా ఆరు రుచులతో కూడినదే.సంతోషానికి, ఆనందానికి బెల్లం(తీపి),జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు,బాధలకు వేపపువ్వు (చేదు),కష్టాలకు చింతపండు(పులుపు),కొత్త ఆశలకు మామిడి (వగరు),జీవితంలోని కోపం, ఉద్వేగాలకు కారం,భయం, ఉత్కంఠకు ఉప్పులను కలిపి దీనిని తయారు చేస్తారు. జీవితంలో సంతోషం,దుఃఖం, కోపం,భయం,అసహ్యం,ఆశ్చర్యం సమతుల్యంగా స్వీకరించాలని ఉగాది పచ్చడి చెప్తోంది.నెమలి వేణుగోపాల స్వామి ఆలయం,మెట్టగుట్ట శ్రీ శేషాచల శ్రీనివాస స్వామి ఆలయం,మేడూరు శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం,ఊటుకూరు శ్రీ కోదండ రామస్వామి ఆలయం,తదితర ఆలయాలు ఉగాది సందర్భంగా ముస్తాబయ్యాయి.ఆలయాల్లో ప్రత్యేక పూజలు,పంచాంగ పఠనం నిర్వహించనున్నారు.

Leave a Reply