పశువులకు టీకాల కార్యక్రమం..

పశువులకు టీకాల కార్యక్రమం..
జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని ఉష గాం లో బుధవారం జైనూర్ పశువైద్యాధికారి మురళీకృష్ణ ఆధ్వర్యంలో వెటర్నరీ అసిస్టెంట్ రాథోడ్ సికిందర్ పశువులకు టీకాల కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ అక్రమ నిర్మల శశిపాల్ తో కలిసి పశువులకు టీకాలు వేశారు. ఈ టీకాల కార్యక్రమంలో 300 పశువులకు గాలికుంటు టీకాలు వేసినట్లు జై నూర్ పశు వైద్యశాల వెటర్నరీ అసిస్టెంట్ సికిందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉషగం సర్పంచ్ ఆత్రం నిర్మల శశి పాల్, పశువైద్య సిబ్బంది ప్రకాష్, మంగిలాల్ రైతులు పాల్గొన్నారు.
