1October1953 |ప్రజల కోసం జీవితాన్ని అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు …

1October1953 | ప్రజల కోసం జీవితాన్ని అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు …
దేవినేని ఉమామహేశ్వరరావు…
1October1953 | విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : ఉద్యమం కోసం ప్రాణత్యాగం చేస్తానని తెలిసినా నిరసన దీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచే మహనీయుడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని గొల్లపూడిలోని పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధన కోసం పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ఆయన మరణానంతరం ఘంటసాల ముందుకు వచ్చి శవయాత్ర నిర్వహించి ప్రజల్లో చైతన్యం రేపితే, ప్రజల ఆగ్రహావేశంతో చివరకు 1953 అక్టోబర్ 1న కర్నూలును రాజధానిగా చేసుకుని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు.
భాషాప్రాయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమన్నారు. ఆయన దేశభక్తి, త్యాగం, సేవాభావం, ఐక్యత భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆత్మగౌరవ నినాదంతో ప్రజలకు సేవచేస్తే, నేడు చంద్రబాబు నాయుడు ఆత్మవిశ్వాసంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.

