గ్యాస్ ఏజెన్సీ పరిశీలించిన తహసీల్దార్, ఎస్సై

మామడ, ఆంధ్రప్రభ : సోషల్ మీడియాలో గ్యాస్ కొరత గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దని మామడ తహసీల్దార్ శ్రీనివాస్ రావు అన్నారు. శనివారం ఎస్సై అశోక్ తో కలిసి మండల కేంద్రంలోని హెచ్ పి గోదాం ను వారు పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అనవసరంగా పుకార్లను నమ్మి అవసరం లేకుండా గ్యాస్ తీసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తిప్పరపు బాపయ్య, సిబ్బంది ఉన్నారు.
