Villagers Catch Thief : దొంగ దొరికాడోచ్​..Andhra Prabha Crime News

Villagers Catch Thief : దొంగ దొరికాడోచ్​..Andhra Prabha Crime News

పోలీసులే కదలలేదోచ్​

స్టేషన్​ కు తరలించిన ఊరిజనం

జీలగలగండిలో చిత్రం విచిత్రం

( ఆంధ్రప్రభ, ఘంటసాల )

Villagers Catch Thief | కృష్ణా జిల్లా ఘంటసాల మండల పరిధిలోని జీలగలగండి వద్ద యువకుడు రాత్రి 9 గంటల సమయంలో దొంగతనానికి ప్రయత్నించాడు. జీలగలగండిలో ఓ వృద్ధురాలి ఇంటి తలుపు తట్టగా, వృద్ధురాలు స్పందించలేదు. మరోసారి మీటర్ దగ్గర ఫీజ్ తొలగించి మళ్లీ తలుపు కొట్టగా వృద్ధురాలు భయాందోళన చెంది కేకలు వేయడంతో స్థానికులు ఇంటి వద్దకు చేరుకున్నారు. స్థానికులు అందరూ యువకున్ని పట్టుకోగా, ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకోసం వచ్చావ్ అని గట్టిగా ప్రశ్నించడంతో… అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలు లంక గ్రామం అని, దొంగతనానికి వచ్చినట్టు తెలిపాడు.

Villagers Catch Thief పోలీసులకు ఫోన్​ చేసినా..

స్థానికులు పోలీసులకు సమాచారం అందించినప్పటికీ రాకపోవడంతో గ్రామస్తులే స్వయంగా ఆటోలో యువకుడిని ఘంటసాల పోలీస్ స్టేషన్లో అప్పగించారు. యువకుడు మద్యం మత్తులో ఉండడం, రాత్రివేళ దొంగతనానికి రావడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Leave a Reply