అంగన్ వాడి పిల్లలకు విద్య సామగ్రి పంపిణీ…

అంగన్ వాడి పిల్లలకు విద్య సామగ్రి పంపిణీ…

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామం లోని సురేష్ నగర్ లో గల అంగన్ వాడి కేంద్రంలో ఉపసర్పంచ్ తక్కురి ముత్యం శేఖర్ చేతుల మీదుగా చౌట్ పల్లి ఎస్బిఐ బ్యాంక్ వారు అందచేసిన విద్య సామగ్రి బ్యాగ్, పలకలు, పుస్తకాలు, పెన్సిల్, స్టిల్ ప్లేట్స్, వాటర్ బాటిల్సను సోమవారం పిల్లలకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ తక్కురి ముత్యం మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన విద్యను,పౌష్టిక ఆహారం అందించి పిల్లలను, గర్భిణీలను ఆరోగ్యవంతంగా చూసుకోవసిన గురుతర బాధ్యత అంగన్ వాడి టీచర్లదే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి సూపర్వైజర్ గంగ హంస, వార్డ్ సభ్యులు సాదుల్లా, న్యాయవాది సుంకరి విజయ్ కుమార్, నరేష్, అనిల్, ఏఎన్ఎం అరుణ, అంగన్ వాడి టీచర్లుపద్మ, శోభ, సరిత, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply