హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రారంభానికి సన్నాహాలు..

అచ్చంపేట, ఆంధ్రప్రభ : మహిళల ఆరోగ్య రక్షణకు కీలకమైన హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముందు అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ఆదివారం (మార్చి 8) నుంచి ప్రారంభం కానున్న ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని శనివారం డిప్యూటీ డీఎం&హెచ్ఓ డాక్టర్ తారాసింగ్, అచ్చంపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ రావు పరిశీలించారు.

ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ నిల్వ, పంపిణీ విధానం, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను వారు సమీక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 14 సంవత్సరాలు నిండిన బాలికలకు మొదటి విడతగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. బాలికల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ ఆఫీసర్ భగత్ సింగ్ పాల్గొన్నారు.

Leave a Reply