Drinking water | అధికారులతో కలిసి సమస్య పరిశీలన..

Drinking water | అధికారులతో కలిసి సమస్య పరిశీలన..
- కలెక్టర్ సార్ జరా దేఖో కథనానికి స్పందించిన చైర్మన్
- శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ
Drinking water | స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డుకు చెందిన బాధితు డు వెలమజల వెంకట్ రెడ్డి తాగునీటిలో మురుగు నీరు కలుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ బకెట్లో నీటిని తీసుకుని మున్సిపల్ కార్యాల యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై నిన్న వెలువడిన “కలెక్టర్ సార్ జరా దేఖో” కథనానికి మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ స్పందించారు. శనివారం స్థానిక కౌన్సిలర్ బొల్లు లక్ష్మీ, మున్సి పల్ అధికారులతో కలిసి ఆయన సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

ప్రతాప్ టెంట్ హౌస్ సమీపంలో డ్రైనేజ్ పై నిర్మించిన సీసీ రోడ్డును తొల గించి సమస్యను పరిష్కరిస్తామని సంబంధిత వారికి నోటీసులు జారీ చేశా రు. మురుగు నీరు కలసి మంచినీటి సమస్య వస్తున్నదనే విష యాన్ని పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్య లు తీసుకుంటామని తెలిపారు. అలాగే మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో కూడా ఉన్న డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేం దుకు చర్యలు తీసుకుంటామని చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు.
చైర్మన్ వినయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు:
కొత్తగా ఎన్నికై బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్మన్ తాటికొండ విన య్ కుమార్ వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమస్య తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని అధికారులతో కలిసి పరిశీలించి పరిష్కా రం దిశగా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్య క్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ పొన్న రవి, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
