Nitish Kumar | సీఎం నితీష్ కుమార్ సంచలన నిర్ణయం

Nitish Kumar | సీఎం నితీష్ కుమార్ సంచలన నిర్ణయం
- బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం
- రాజ్యసభకు నీతీశ్ కుమార్.. ఎక్స్‌లో ప్రకటన
- బిహార్ సీఎం పదవికి రాజీనామ చేసేందుకు సిద్ధమైన నీతీష్
- ప్రజల మద్దతుతో బిహార్‌కు రెండు దశాబ్దాలుగా సేవ చేసినట్లు వెల్లడి
- భవిష్యత్తులో కూడా ప్రజల్లోనే ఉంటా, ప్రజాలకు సేవలు చేస్తానని వెల్లడి
- రాజ్యసభకు వెళ్లడం నా చిరకాల కోరిక
- రాష్ట్రంలో రెండు చట్టసభలకు..
- పార్లమెంట్‌లో రెండు సభలకు ప్రాతినిధ్యం వహించాలని అనుకున్నా
- జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్
Nitish Kumar | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: బిహార్ రాజకీయల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జేడీయూ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నట్లు వెల్లడించారు. రెండు దశాబ్దాలుగా మీరు నన్ను నమ్మి నాకు మద్దతు ఇచ్చారు. అంకితభావంతో నా విధుల్ని నిర్వర్తించాను. మీ మద్దతుతో నా పార్లమెంటరీ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచే మనసులో ఒక కోరిక ఉండేది. రాష్ట్ర స్థాయిలో రెండు చట్టసభలకు, పార్లమెంట్‌లో రెండు సభలకు ప్రాతినిధ్యం వహించాలని అనుకున్నాను. అందుకే త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజ్యసభ ఎంపీగా నా ప్రయాణాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాను. కొత్త బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా బిహార్‌తో నా బంధం కొనసాగుతుందని హామీ ఇస్తున్నాను. కొత్త ప్రభుత్వానికి నా పూర్తి మద్దతు అందిస్తాను అని తన పోస్టులో నీతీష్ కుమార్ పేర్కొన్నారు.

దీంతో బిహార్ రాజకీయల్లో గందరగోళం నెలకొంది. ఓవైపు జేడీయూ నేతలు సీఎం పదవికి రాజీనామ చేయకుడాదని అభ్యంతరం తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి పదవి బీజేపీ పార్టీ సొంతం అవుతుందని బిహార్ రాజకీయ వర్గలు జోరుగా ప్రచారం కొనసాగుతుంది. బిహార్ నూతన సీఎం అయ్యేందుకు పలువురు పోటీపడుతున్నారు. ఆ జాబితాలో డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌధరీ, విజయ్‌కుమార్ సిన్హా, బిహార్ మంత్రి దిలీప్ జాయస్‌వాల్, దిఘా భాజపా ఎమ్మెల్యే సంజీవ్ చౌరాసియా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పేర్లు వినిపిస్తున్నాయి. కాగా దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. అయితే నితీష్ కుమారుడు నిషాంత్‌ను ఉపముఖ్యమంత్రి అవుతాడు అనే వార్తలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది.
నితీష్ కుమార్ ప్రస్తానం చేసుకుంటే 75 ఏళ్ల నితీష్ కుమార్ దేశంలోనే రికార్డు స్థాయిలో బిహార్ ముఖ్యమంత్రిగా పదిసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయాల్లో ఆయనను చాణ్యకుడిగా అభివర్ణిస్తారు. అలాంటి నితీష్ కుమార్ 2005 నుంచి సీఎంగా కొనసాగుతున్నారు. ఎన్డీయే అయినా లేదా మహాకూటమి అయినా ఎందులో ఉన్నా ఆయనే సీఎంగా కొనసాగారు. రాజకీయ ఎత్తుగడలు, కూటములు మారినప్పటికీ ప్రజల్లో ఆయన ఆదరణ చెక్కచెదరలేదు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నిపుణుల అంచనాలను తల్లకిందులు చేస్తూ మహిళల మద్దతుతో నితీష్ మళ్లీ అద్భుత విజయం అందుకున్నారు.
