America | యుద్ధాన్ని త‌క్ష‌ణ‌మే ఖండించాలి…

America | యుద్ధాన్ని త‌క్ష‌ణ‌మే ఖండించాలి…

America | భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న దాడులను మోడీ ఖండించకుండా తటస్థంగా వ్యవహరించడం దుర్మార్గమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విమర్శించారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న దాడులపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బుధవారం హాట్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యుద్ధానికి రెండు రోజుల ముందు మోడీ ఇజ్రాయిల్ తో చేసుకున్న ఒప్పందాల ప్రకారమే మౌనం వహిస్తున్నారని, ఇరాన్ లో అణుఆయుధాలు ఉన్నాయంటూ అమెరికా, ఇజ్రాయిల్ ఈ ఘాతుకానికి పాల్పడటం దారుణమన్నారు. ఇరాన్ లో అణుశక్తిని విద్యుత్ అవసరాల కోసం వాడుతున్నారని, కేవలం పెట్రోలియం పై ఆధిపత్యం కోసం ఈ యుద్ధం చేస్తున్నారని తెలిపారు.

ఇజ్రాయిల్ తో స్నేహానికి మోడీ స్వస్తి పలకాలని, తటస్థ వైఖరిని విడనాడి.. అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ పై చేస్తున్న యుద్దాన్ని తక్షణమే ఖండించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలు కూడా ఈ యుద్ధాన్ని ఖండించాలన్నారు. చంద్రబాబు, జగన్ లు మోడీ భజన మానుకోవాలని సూచించారు. ఈ యుద్ధం ప్రపంచ శాంతికి భంగం కలగడమే కాకుండా, భారత దేశ ప్రయోజనాలకు తీవ్ర నష్టం ఏర్పడుతుందన్నారు.

America |

స్కీం వర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలి

ఆంధ్రప్రదేష్‌లో రెండు లక్షల మంది స్కీం వర్కర్లు ఉన్నారని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు సూచించారు. అంగన్వాడి ఆశాలతో పెట్టుకున్న ఎవరూ అధికారంలో లేరని ఆయన హెచ్చరించారు. అధికారుల బెదిరింపులు సరికాదని పోలీస్ స్టేషన్కు పిలిపించుకుని లెటర్‌లో రాయించుకోవటం దారుణం అన్నారు.

బెదిరింపులతో ఎంతో కాలం పరిపాలన సాగించలేరని అన్నారు. మినిమం టైం స్కేల్ ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఆదాయం పెరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సూచించారు. పచ్చని పశ్చిమగోదావరి జిల్లాలో తాగడానికి పనికిరాకుండా తాగునీరు ఉందని, ఇంత దారుణమైన పరిస్థితి ఇక్కడ ఉండటం బాధాకరమన్నారు. అధికారులు తనిఖీలు చేయకుండా వారి చేతులను కట్టేసారని ఆయన ఆరోపించారు.

Leave a Reply