tips| ఆరోగ్య సూత్రాలు..

మార్చిలోనే మంట‌లు
భ‌గ్గుమంటున్న ఎండ‌లు..
ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు న‌మోదు
ఆరోగ్య జాగ్ర‌త్త‌లు పాటించ‌కుంటే క‌ష్టాలే..
వేస‌విలో ఇలా చేద్దాం..

  • ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి.
  • ఎండలోకి తప్పనిసరిగా వెళ్లేవారు సన్‌స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా వాడాలి.
  • పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది.
  • రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి.
  • ఒంటికి వదులుగా ఉండే కాట‌న్ దుస్తులు ధరించాలి.
  • ఎండలో ప్రయాణించే వారు గొడుగు, హెల్మెట్, గ్లౌజ్‌లు వాడాలి.
  • కళ్లకు రక్షణగా సన్‌ గ్లాసెస్‌ ధరించడం మర్చిపోవద్దు.
  • తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండేవిధంగా చూసుకోవాలి.
  • ముఖ్యంగా పసి పిల్లలపై ఎండ ప్రభావం పడకుండా చూసుకోవాలి.
  • ఉదయం 8 గంటలలోపే పిల్లలకు స్నానాలు ముగించాలి.
  • పలుచని బట్టలు వేయాలి.
  • ఎండలో బయటికి వెళ్లే సమయంలో కళ్లద్దాలు సన్‌వూస్కీన్‌లోషన్లు వాడాలి.
  • చిన్న పిల్లలకు తల్లి పాలు తప్పనిసరిగా పట్టించాలి.
  • గంటకోసారి గ్లాసు నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.
  • ఫ్రిజ్‌ నీరు కంటే కుండలో నీరు తాగడం వల్ల గొంతు సమస్యలు రావు.
  • కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగి అంబలి వంటివి శరీరంలోని ఎలక్ర్టోలైట్స్‌ సమతుల్యతను కాపాడతాయి.
  • వేసవిలో మసాలాలు, వేపుళ్లు తగ్గించి ఆకు కూరలు, కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వండి.
  • పుచ్చకాయ, దోసకాయ, తాటి ముంజలు వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను డైట్‌లో చేర్చుకోండి.
  • ఇవి డీహైడ్రేషన్‌ నుంచి కాపాడతాయి.
  • వేసవిలో నూనెతో చేసిన చిరుతిండ్లు తినటం, కాఫీ ,టీ ,మత్తు పదార్ధాలను సేవించటం ,ధూమపానం ఇవన్నీ ప్రాణాంతకమైనవే..
    తేలికగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలు ,జావ ,.గంజి ,సలాడ్ లవంటివి ఆరోగ్యానిన అత్యుత్తమమైనవే..
    కూల్ డ్రింకులూ ,రెడీమెడీ ఫుడ్లూ , పిజ్జాలం ,బర్గర్లూ తింటే కోరికావాలని మనప్రాణాలను హైరిస్క్ పెట్టినట్లే..
  • పుచ్చకాయ జ్యూస్ , సపోటా , కర్భూజా ,చెరకురసం ,నిమ్మకాయ షర్బత్ ,అల్లం ,పుదీనా ,నిమ్మరసం , ఉప్పు కలిపిన చల్లని (తగినంత చల్లని) మజ్జిగ ..సబ్జాగింజల పానీయం ,బార్లీ జావ , తాటిముంజెలు , కొబ్బరినీరు ఇవన్నీ వేసవితాపం నుండి బయటపడవేసే దివ్యమైన ఆహార పానీయాలే.

చ‌ర్మ సౌంద‌ర్యం కోసం..

  • రోజంతా చర్మం పై తేమ ఉండేలా చూసుకోవాలి.
  • ఇందుకోసం వాటర్ కలిసిన మాయిశ్చరైజింగ్ క్రీమును రాసుకోవాలి.
  • దానికంటే ముందుగా ముఖంపై రోజ్ వాటర్‌ను రాసుకుంటే మంచిది.
  • చర్మం బాగా పొడిబారిపోయినప్పుడు సబ్బుతో ఎక్కువ సార్లు కడుక్కోవద్దు.
  • దీనికి బదులుగా వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే తాజాగా ఉంటుంది.
  • వేసవిలో ముఖంపై ఎక్కువగా జిడ్డు పేరుకుంటుంది.
  • కనుక చల్లటి నీటితో కనీసం నాలుగైదు సార్లయినా కడుక్కోండి.
  • ఎండలోంచి నీడకు వెళ్లిన వెంటనే కాకుండా కొంచెం సేపు ఆగి కడుక్కోండి.
  • ఐస్‌తో ముఖంపై మర్దన చేసుకుంటే చర్మం మరింత తాజాదనం సంతరించుకుంటుంది.
  • స్క్రబ్బర్‌లను ఉపయోగించకండి. దానివల్ల చర్మం మరింత పొడిబారుతుంది.
  • టమాటా, నిమ్మరసంతో ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మంపై జిడ్డు పూర్తిగా వదిలిపోతుంది.
  • అంతేకాదు ముఖంపై ఉన్న బ్లాక్‌హెడ్స్ కూడా తగ్గిపోతాయి.
  • ముఖంపై ర్యాషెస్ లేదా మొటిమలు ఉంటే మాత్రం నిమ్మరసాన్ని ఉపయోగించవద్దు.
  • వేసవిలో కేశ సంరక్షణ కూడా చాలా ముఖ్యం.
  • జుట్టును మరీ పొడవుగా ఉంచుకోకుండా వీలయినంత తక్కువగా ఉంచుకుంటే మంచిది.
  • ఎండకు శిరోజాలు దెబ్బతినకుండా ఉండడానికి కండీషనర్ క్రీమును రాసుకోవడం తప్పనిసరి.
  • హెన్నాచాలా చక్కని కండీషనర్‌గా ఉపయోగపడుతుంది.
  • వేసవిలో ఎక్కువగా స్విమ్మింగ్ చేయడం చాలా మందికి అలవాటు.
  • అయితే స్విమ్మింగ్ ఎక్కువ సమయం చేయడంవల్ల నీళ్లలో ఉండే క్లోరిన్ కేశ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది.
  • కనుక స్విమ్మింగ్ చేసేటప్పుడు తప్పకుండా తలకు మాస్క్ ధరించడం మరచిపోవద్దు.

Leave a Reply