నేర నివారణే లక్ష్యంగా..

నేర నివారణే లక్ష్యంగా..

జిల్లా లో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డెన సెర్స్ ఆపరేషన్ నిర్వహణ…
సరైన ధ్రువపత్రాలు లేని మోటార్ సైకిళ్ళు, మందు బాటి ళ్లు స్వాధీనం…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నివారణే లక్ష్యంగా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు సబ్ డివిజన్ ఏ ఎస్ పి ఎం.జావళి సూచనలతో నేటి తెల్లవారుజామున రెండవ పట్టణ ఇన్స్పెక్టర్ అస్రార్ భాష , స్థానిక పోలీసు సిబ్బంది బృందాలుగా ఏర్పడి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వనగర్ మరియు ఫకీర్ పేట నందు కార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. విశ్వనగర్ నందు నేర చరిత్ర గలవారు మరియు అనుమానితులు, రౌడీ షీటర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో సరైన ధ్రువపత్రాలు లేని మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నరు.

ఏవరైనా చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసు అధికారులు హెచ్చరించారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లు నిరంతరం కొనసాగుతుంటాయని పేర్కోన్నారు. బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపురం గ్రామం నందు కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.ఉదయం తెల్లవారుజామున బండిఆత్మకూరు సబ్ ఇన్స్పెక్టర్ జగన్ మోహన్ తమ సిబ్బంది సహాయంతో సమస్యాత్మక గ్రామమైన లింగాపురం నందు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అనుమానాస్పద ప్రదేశాలు తనిఖీలు నిర్వహించడంతో పాటు రౌడీ షీటర్లు, నేర చరిత్ర గల వారి ఇళ్లలో సోదాలు నిర్వహించడం జరిగిందన్నారు.

గ్రామస్తులతో సమావేశం నిర్వహించి సైబర్ భద్రత, రోడ్డు ప్రమాదాల,సీసీ కెమెరాలు ఏర్పాటు, బాల్యవివాహాలు, కొత్త చట్టాలు మొదలగు వాటిపై అవగాహన కల్పించడంతోపాటు గ్రామాలలో ఏదైనా సమస్య ఉంటే ముందుగా పోలీసు వారి దృష్టికి తీసుకొని రావాలని చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు లేదా వాహనాలను గమనిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయని భరోసా ఇచ్చరు.

Leave a Reply