నకిలీ సంస్థలపై కేటీఆర్ ఆగ్రహం..!

నకిలీ సంస్థలపై కేటీఆర్ ఆగ్రహం..!

నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదు..!
ఆ సంస్థలు బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే పని చేయాలి
మాజీ మంత్రి కేటీఆర్

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ః కేటీఆర్ పేరుతో వస్తున్న నకిలీ సంస్థలపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది కేటీఆర్ సేవా సమితి, కేటీఆర్ సేన పేరుతో కొన్ని కార్యకలాపాలు చేపడుతున్నారని, తన పేరుతో వస్తున్న సంస్థలకి అనుమతి లేదని.. అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని హెచ్చరించారు. ఎవరైనా పనిచేయాలనుకుంటే ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply