బేతంచెర్లలో ఘోర రోడ్డు ప్రమాదం

జిల్లాలో కూలీలను తీసుకెళ్తున్న ఆటో బోల్తా
డ్రైవర్ మృతి.. పది మంది కూలీలకు తీవ్ర గాయాలు
కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభః నంద్యాల జిల్లాలో బేతంచెర్ల నుంచి హుసేనాపురంకి వెళ్తున్న ఆటోలో వ్యవసాయ కూలీలను పనుల నిమిత్తం వెళ్తున్నారు. సీతారాంపురం మెట్ట వద్ద రోడ్డు మలుపు వద్ద లారీని తప్పించబోయి అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మధు తో పాటు పదిమంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. రోజు కూలీలను బేతంచెర్ల నుంచి క్షణాపురంకు తీసుకెళ్లే ఆటోలోనే రోజు మాదిరిగా తీసుకెళ్లాడు. వీరందరిని కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆటో డ్రైవర్ మధు (29) కోలుకోలేక మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన పదిమంది మహిళలకు చికిత్స నిర్వహిస్తున్నారు. బంధువులందరూ ఆసుపత్రికి చేరుకోవటం విశేషం. బేతంచర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply