ఆంధ్రప్రభ ఎఫెక్ట్.. సబ్ రిజిస్ట్రార్ గిరి పై విచారణ..

ఆంధ్రప్రభ ఎఫెక్ట్.. సబ్ రిజిస్ట్రార్ గిరి పై విచారణ..

వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి : గత కొద్దీ రోజులుగా ఆంధ్రప్రభ దినపత్రికలో నర్సంపేట సబ్ రిజిస్ట్రార్ గిరి పై వస్తున్న కథనాలకు రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ సుభాషిణి స్పందించారు. జిల్లా రిజిస్ట్రార్ ను విచారణ చేయమని చెబుతామని, విచారణ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. మరో పక్క నకిలీ రిజిస్ట్రేషన్ లు తవ్వినా కొద్దీ బయటికి వస్తున్నాయి. సాక్ష్యం కోసం అని చెప్పి అమాయకుల ఇండ్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్న అంశాలు బయటికి వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి అధికారుల విచారణ నివేదిక కోసం వేచి చూడాల్సిందే..

Leave a Reply