పునర్వికకు త్వరలోనే మెరుగైన వైద్యం…

పునర్వికకు త్వరలోనే మెరుగైన వైద్యం…
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : తమ కుమార్తె పునర్వికకు ప్రజలు అండగా నిలిచి పునర్జన్మ ప్రసాదించారని తండ్రి సురేశ్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల సహకారం తమ కుటుంబానికి అపారమైన ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. మంత్రి టీజీ భరత్ ప్రోత్సాహం, స్వచ్ఛంద సంస్థల సహకారం మరువలేనిదని తెలిపారు. అలాగే మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటన తమకు కొండంత భరోసానిచ్చిందని పేర్కొన్నారు.
త్వరలోనే పునర్వికకు నిపుణులైన వైద్యులు మెరుగైన చికిత్స అందించనున్నారని, ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ సురేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
