ప్రసంగి మృతదేహనికి నివాళులర్పిస్తున్న విజయపాల్ రెడ్డి

ప్రసంగి మృతదేహనికి నివాళులర్పిస్తున్న విజయపాల్ రెడ్డి

పరకాల,ఆంధ్రప్రభ: పట్టణంలో అకాల మరణం చెందిన మృతులకు పరకాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి నివాళులర్పించారు. పరకాల మున్సిపల్ పరిధిలోని 7 వ వార్డుకు చెందిన దొమ్మటి ప్రసంగి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పరకాల మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి ప్రసంగి పార్దివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి వెంట బీఆర్ఎస్ పార్టీ పరకాల పట్టణ ఉపాధ్యక్షులు దుంపేటి నాగరాజు, 7వ వార్డు అధ్యక్షులు ఉడుత సుమన్, ఉపాధ్యక్షులు గునిగంటి రవి తదితరులు ఉన్నారు.

సమ్మయ కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్

పరకాల పట్టణంలోని 18వ వార్డుకు చెందిన ఒంటేరు సమ్మయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పరకాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి సమ్మయ్య పార్థివదేవాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. సమ్మయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విజయపాల్ రెడ్డి వెంట 18వ వార్డు అధ్యక్షుడు ఏకు రఘుపతి మరియు బీఆర్ఎస్ నాయకులు, యూత్ నాయకులు ఉన్నారు.

Leave a Reply