వైద్యుల నిర్లక్ష్యం.. యువకుడు మృతి

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : వైద్యుల నిర్లక్ష్యం కారణంగా యువకుడు మృతి చెందిన సంఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమ్‌గల్‌ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన గంగం అజయ్ (22) చెవి నొప్పి తో నిజామాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చేరాడు. చెవి ఆపరేషన్ చేస్తుండగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందడం జరిగింది. యువకుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట డెడ్ బాడీ ని తీసుకొని ధర్నా కు దిగారు.

Leave a Reply