ఈనెల 28న జాబ్ మేళా..

ఈనెల 28న జాబ్ మేళా..

  • నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
  • జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ

గన్నవరం – ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను 28న శనివారం నాడు ఉదయం 09:00 గంటలకు గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ,ఐఏఎస్ గారు తెలియజేసారు.

ఈ జాబ్ మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, టెస్ట్2 బిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, బంధన్ బ్యాంక్ లిమిటెడ్, ముక్కు ఫైనాన్షియల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సంతోష్ ఆటోమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మోహన్ స్పింటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుధీర్ టింబర్స్ ప్రైవేట్ లిమిటెడ్, సిఐఈఎల్, ఇన్నోవ్సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, పేటిఎమ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి Dr. పి.నరేష్ కుమార్ తెలిపారు.

ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్(మెకానికల్, సివిల్) పూర్తి చేసిన 18 నుండి 35 సంవత్సరాలలోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి మంచి వేతనం, ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, ఫిబ్రవరి 28న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

ఆసక్తి, తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/ వెబ్సైట్ నందు తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్, పాన్, సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9676708041, 9494005725 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Leave a Reply