ఆ విషయంలో.. తల్లిదండ్రులు కృషి చేయాలి..

ఆ విషయంలో.. తల్లిదండ్రులు కృషి చేయాలి..
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : ఈ నెల 21న జగిత్యాల జిల్లా మెట్టపల్లి పట్టణంలోని నిర్వహించిన స్టేట్ లెవల్ కరాటే పోటీలలో నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణ ఆక్స్ఫర్డ్ హై స్కూల్ విద్యార్థులు 9-10 ఇయర్స్ విభాగంలో గోల్డ్ మెడల్ & సిల్వర్ మెడల్ వచ్చిన సందర్భంగా బుధవారం స్థానిక ఎస్సై సిహెచ్.తిరుపతి విద్యార్థులకు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. విద్యతో పాటు క్రీడాలు కుడా చాలా అవసరమని… పిల్లలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చేలా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. ఆక్స్ఫర్డ్ హై స్కూల్ కు వచ్చిన పిల్లలు క్రీడలు ఆడడం ద్వారా మానసిక ఉల్లాసంగా ఉండడం వలన విద్యార్థుల చదువుకు చాలా ఉపయోగం పడుతుందని అన్నారు. అలాగే ఆక్స్ఫర్డ్ హై స్కూల్ ప్రిన్సిపల్ కోట. జగదీష్ మాట్లాడుతూ… మా పాఠశాల పిల్లలు గోల్డ్ మెడల్ సాధించడం స్కూల్ కి చాలా గుర్వకారణమని అన్నారు.
