నూతన బార్లకు నోటిఫికేషన్

నూతన బార్లకు నోటిఫికేషన్
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లాలో మిగిలిపోయిన 5 బార్లకు నేడు అనగా 23వ తారీఖున గెజిట్ నోటిఫికేషన్ కృష్ణా జిల్లా ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారి జి. గంగాధర్ రావు విడుదల చేశారు. పెడన మున్సిపాలిటీలో (1) బారు, గుడివాడ మున్సిపాలిటీలో (4) బార్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి అప్లికేషన్లు ఆన్లైన్లో గాని, స్వయంగా జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి మచిలీపట్నం కార్యాలయంలో గాని, హైబ్రిడ్ మోడ్ లో గాని దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ప్రతి అప్లికేషన్ తో పాటు రూ.5,00,000 అప్లికేషన్ రుసుము, రూ.10,000 ప్రాసెసింగ్ ఫీజు కట్టాలన్నారు. అప్లికేషన్లు సమర్పించవలసిన చివరి తేదీ మార్చి 2వ తారీకు సాయంత్రం 6 గంటల వరకు అని తెలిపారు. మార్చి 4వ తారీఖు ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ సమక్షంలో జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో గల గ్రీవెన్స్ హాలు నందు లాటరీ తీయబడుతుందన్నారు.
లాటరీలో బారు వచ్చినవారు వెంటనే 1/6th లైసెన్స్ ఫీజు కట్టాలని, ఆన్లైన్ లో అప్లికేషన్లు సమర్పించాల్సిన వారు https://oc.hpfsproject.com వెబ్సైట్లో అప్లికేషన్ సమర్పించాలన్నారు. ప్రతి బారు కేటాయింపునకు కనీసం 4 అప్లికేషన్లు రావలెనని, అప్పుడే లాటరీ తీయబడునన్నారు. లైసెన్స్ ఫీజు మరియు ఇతర వివరములు కొరకు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి సెల్ నెంబర్: 9963604239 అసిస్టెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి సెల్ నెంబర్. 8466981837 కు ఫోన్ చేయాలని కోరారు.
