నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పవర్ గూడ గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి హెచ్‌డీఎఫ్ పథకం ద్వారా రూ.20 లక్షలు మంజూరు కాగా, నిర్మాణం మధ్యలో ఆగడంతో మిగతా పనుల కోసం ఆదివారం పవరుగూడ నూతన సర్పంచ్ తొడసం రాజేందర్ భూమి పూజ చేశారు. భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. నాణ్యత లోపించకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కారోబార్ ఉయిక న్యానేశ్వర్, కాంట్రాక్టర్ గంగన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply