డ్రైనేజీ సమస్యకు పరిష్కారం..

పరకాల, ఆంధ్రప్రభ : డ్రైనేజీ నీరు రోడ్డుపై ప్రవహిస్తున్న సమస్యను వార్డు కౌన్సిలర్ చొరవతో మున్సిపల్ కార్మికులు పరిష్కార చర్యలు చేపట్టడం జరిగింది. శనివారం రోజు పరకాల పురపాలక సంఘం 12వ వార్డులోని దొనీకేన కిరణ్ గల్లీలో రోడ్డుపై అస్తవ్యస్తంగా వెళుతున్న డ్రైనజీ సమస్య పై మున్సిపల్ 12వ వార్డు బిజెపి కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ చొరవ తీసుకుని మున్సిపల్ సిబ్బంది పరిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలు నూతన కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
