Exams | ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Exams | ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

  • కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
  • ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు
  • రాష్ట్ర వ్యాప్తంగా 1564 పరీక్షా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ
  • సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు
  • ఇన్విజిలేటర్ల నియామకం పూర్తి
  • ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు

Exams | నంద్యాల బ్యూరో , ఆంధ్రప్రభ : రాష్ట్రంలోనూ జిల్లాలోనూ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలను పగడ్బందీగా పటిష్టంగా నిర్వహించేలా రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ ఉన్నతాధికారులు జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ నెల ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం నుంచి మార్చి 24వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1564 పరీక్ష కేంద్రాలకు ప్రభుత్వ ప్రవేట్ ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించారు.

ఫ్లయింగ్ స్క్వాడ్‌లగా డిప్యూటీ తహశీల్దార్లను రాష్ట్రవ్యాప్తంగా రెవిన్యూ అధికారులను కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 1564 పరీక్షా కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉండే విధంగా చూసుకోవాలన్న రు.పరీక్షా కేంద్రాల పరిసరాల్లో పారిశుధ్య చర్యలు ముమ్మరంగా చేపట్టాలి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు5,31,275 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం 5,26,624 అంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. నంద్యాల జిల్లాలో మొదటి సంవత్సరం 15,443 మంది విద్యార్థులు,రెండవ సంవత్సరం పరీక్షకు 29,867 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.

అసౌకర్యాలు ఉండకూడదు.. శబ్దాలు వినపడకూడదు..

పరీక్ష రాసే హాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల్లో తగినంత లైటింగ్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందయి. ఎలాంటి శబ్దాలు చేయకూడదు.మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్షా గదిలో గోడ గడియారం ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సమయానికి చేరుకునేలా ఆర్టీసీ బస్సు సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

రహదారులకు సమీపంలో ఉన్న పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పరీక్షలు ముగిసిన వెంటనే సమాధాన పత్రాలను భద్రతతో పోస్టు కార్యాలయాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని పోస్టల్ శాఖ అధికారులకు ఆదేశాలు అందా యి.ప్రశ్న పత్రాల సెట్టు నెంబర్లు అందిన వెంటనే పోలీసు ఎస్కార్ట్‌తో పరీక్షా కేంద్రాలకు ప్రశ్న పత్రాలు తరలించే ఏర్పాట్లు పోలీస్ అధికారులు చేపడుతారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేస్తామని పోలీస్ శాఖ పరీక్షా కేంద్రాల నిర్వాహకులకు హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని కూడా పోలీస్ శాఖ ఆదేశించారు.

ఇంటర్‌ పరీక్షల్లో 32 పేజీల బుక్‌లెట్‌…

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంటర్మీడియట్ మొదటి రెండు సంవత్సరాలు పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ షెడ్యూల్ ఇలా ఉన్నాయి. ఇంటర్మీడియట్ మొదటి రెండవ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 23 వ తేది న 2వ భాష అయినా తెలుగు సబ్జెక్ట్. 25 వ తేది న ఇంగ్లీష్ సబ్జెక్టు పరీక్ష, 27 వ తేది న హిస్టరీ,బోటనీ పరీక్షలు మార్చి 2 వ తేది న మ్యాథమేటిక్స్-Iఏ పరీక్ష, మార్చి 5 వ తేది న బయాలజీ, మ్యాథమేటిక్స్-Iబి, జుజూలజీ పరీక్షలు, మార్చి 7 వ తేది న ఎకనామిక్స్ పరీక్ష,మార్చి 10 వ తేది న ఫిజిక్స్ పరీక్ష,మార్చి12 వ తేది న కామర్స్,సోషియాలజీ,ఫైన్ ఆర్ట్స్ పరీక్షలు, మార్చి 14 వ తేది న సివిక్స్ మరియు బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పరీక్షలు, మార్చి 17 వ తేది న కెమిస్ట్రీ పరీక్షలు,మార్చి 20 వ తేది న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మరియు లాజిక్ పరీక్షలు,మార్చి 24 వ తేది న మోడరన్ లాంగ్వేజ్ మరియు జియోగ్రఫీ పరీక్షలు ఉంటాయి.
రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫిబ్రవరి 24 వ తేది తెలుగు పరీక్ష,ఫిబ్రవరి 26 వ తేది న ఇంగ్లీష్ పరీక్ష, ఫిబ్రవరి 28 వ తేది న బోటనీ మరియు హిస్టరీ పరీక్షలు, మార్చి 3 వ తేదీన మ్యాథమేటిక్స్IIఏ, సివిక్స్ పరీక్షలు, మార్చి 6 వ తేది న జువాలజీ మరియుఎకనామిక్స్ పరీక్షలు,మార్చి 9వ తేదిన మ్యాథమేటిక్స్-IIబి పరీక్ష, మార్చి 11 వ తేది న కామర్స్ మరియు సోషియాలజీ మరియు ఫైన్ ఆర్ట్స్ పరీక్షలు, మార్చి 13 వ తేది న ఫిజిక్స్ పరీక్ష, మార్చి 16 వ తేది న మోడరన్ లాంగ్వేజ్ మరియు జియోగ్రఫీ పరీక్ష బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పరీక్ష,మార్చి 18 వ తేది న కెమిస్ట్రీ పరీక్ష, మార్చి 23 వ తేది న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు లాజిక్ పరీక్షలు ఉంటాయి. పరీక్ష రాసే విద్యార్థులు ఆయా సబ్జెక్టుల తేదీలు చూసుకొని పరీక్ష టైం కు పరీక్షా సెంటర్ కు చేరుకోవాల్సి ఉంటుంది.

ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు..
వాట్సాప్ గవర్నర్ మనమిత్ర ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు..

ప్రవేట్ కళాశాలకు చెక్..

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న యి. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేట్ కళాశాలకు చెక్ పెట్టింది. ఫీజు చెల్లిస్తే గాని హాల్ టికెట్లు ఇవ్వము అన్న మాట రాకుండా ఉండేందుకు మన మిత్ర వాట్సాప్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి సంతకం లేకున్నప్పటికీ పరీక్షా సెంటర్కు హాజరు కావచ్చు అని ఇంటర్మీడియట్ బోర్డు విద్యా మండలి కార్యదర్శి రంజిత్ భాష ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోనూ జిల్లాలను ఏ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వమని అంశం రాకూడదని అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి హెచ్చరించారు. 

వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా హాల్‌టికెట్లు పొందొచ్చన్నారు. మొదటి సంవత్సరం వారు పదో తరగతి హాల్‌ టికెట్‌ నంబరు, ద్వితీయ సంవత్సరం వారు మొదటి సంవత్సరం హాల్‌ టికెట్‌ నంబరు లేదా ఆధార్‌ నంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. మనమిత్ర వాట్సప్‌ నంబరు 955230 0009కు హాయ్‌ అని మెసేజ్‌ పెట్టి, హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. హాల్‌ టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్, కళాశాల స్టాంప్‌ అవసరం లేదని తెలిపారు. విద్యార్థులు పరీక్ష లు బాగా రాసి పాస్ కావాలని తల్లిదండ్రులు విద్యాసంస్థల యాజమాన్యాలు ఆశిస్తున్నారు.

Leave a Reply