dull| డ‌ల్‌నెస్‌కు బైబై..యాక్టివ్‌గా మారండిలా..

డ‌ల్‌నెస్‌కు బైబై..యాక్టివ్‌గా మారండిలా..

  • నీరసంగా ఉండటం వెనుక ప్రధాన కారణం ఎక్కువగా నీళ్లు తాగకపోవడం.
  • ప్రతీ రోజు నాలుగు నుండి ఐదు లీటర్ల నీళ్లు తాగాలి అని వైద్యులు సూచిస్తున్నారు.
  • ఉదయం ఏమీ ఆహారం తీసుకోకపోతే రోజంతా నీర‌సంగా ఉంటుంది.
  • చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయ‌క‌పోవ‌డంతో నీరసం ఉంటుంది.
  • మధ్యాహ్నం భోజనం చేయడం కన్నా ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం చాలా ముఖ్యం.
  • ఉదయం బ్రేక్ ఫాస్ట్ తోనే ఉత్సాహంగా ఆరోజు పనిలో ముందుకు వెళ్తాం.
  • ఐరన్ లోపం ఉన్న వారిలో నీరసంగా ఉంటుంది.
  • ఆకుపచ్చని కూరగాయలను, ఆకు కూరలను తింటే ఐరన్ పుష్క‌లంగా ల‌భిస్తుంది.
  • జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.
  • ఉదయం లేదా వ్యాయామానికి ముందు అరటిపండు తింటే అలసట త్వరగా తగ్గుతుంది.
  • తక్షణ శక్తి కావాలంటే ఖర్జూరం బెస్ట్. ఇందులో గ్లూకోజ్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి.
  • 2-3 ఖర్జూరాలు తింటే శరీరం యాక్టివ్‌గా మారుతుంది.
  • గుడ్లు ప్రోటీన్‌కు మంచి వనరు. ఇవి కండరాలను బలంగా చేసి రోజంతా శక్తిని నిలబెట్టడంలో సాయపడతాయి.
  • ఉదయం గుడ్డు తింటే అలసట తగ్గుతుంది.
  • బాదం, వాల్నట్, జీడిపప్పు లాంటివి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
  • రోజూ ఉదయం 4-5 నానబెట్టిన బాదం తింటే ఉత్సాహం పెరుగుతుంది.
  • పెరుగులో ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచి శరీరానికి శక్తిని అందిస్తాయి.
  • నెమ్మదిగా శక్తిని విడుదల చేసే ఆహారం ఓట్స్. ఉదయం అల్పాహారంగా తింటే ఎక్కువసేపు యాక్టివ్‌గా ఉంటారు.

ఇలా కూడా చేయండి..

  • ప్రతిరోజూ కనీసం 7–8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం.
  • నిద్రలేమి చిరాకు, నీరసానికి దారితీస్తుంది.
  • ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది.
  • నడవడం, యోగా, డ్యాన్స్‌ లేదా ఇష్టమైన ఏదైనా శారీరక శ్రమ చేయవచ్చు.
  • ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం లేదా రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ కోసం కేటాయించండి.
  • పాజిటివ్‌ ఆలోచనలు.. ప్రతికూల ఆలోచనలను తగ్గించుకుని సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోండి.

Leave a Reply