దేవరావు మృతి తీరనిలోటు..

జైనూర్ , ఆంధ్రప్రభ ; కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మార్లవాయి రాయి సెంటర్ సర్మిడి జుగునక దేవురావు మృతి చెందడం ఆదివాసి సమాజానికే తీరనిలోటని ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బోజ్జు పటేల్ అన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బోజ్జు పటేల్ తో పాటు ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, జై నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్ రావు మార్లవాయి సందర్శించి జుగ్నాక దేవురావు పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసి సమాజ అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి సర్ మేడిగా ఎన్నో సేవలు అందించారని వారు అన్నారు. దేవరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగడ సానుభూతి తెలిపి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో మార్లవాయి సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగు, స్థానిక నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply