మైనర్ బాలికను వంచించిన యువకుడిపై కేసు నమోదు

మైనర్ బాలికను వంచించిన యువకుడిపై కేసు నమోదు
చిట్టినగర్,ఆంధ్రప్రభః విజయవాడ సాయిరాం థియేటర్ సమీపంలో నివసించే ఒక మైనర్ బాలిక (16) ను హేమంత్ నాగ సాయి (23) అనే యువకుడు మాయ మాటలు చెప్పి వంచించాడు. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె తో శారీరకంగా కలిసినట్లు బాధితురాలు కొత్తపేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది అని పోలీసులు తెలిపారు. టూ టౌన్ పోలీసులు నిందితుడు హేమంత్ నాగ సాయి పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
